శ్రీవైష్ణవదివ్యదేశాలు – భాగం 5

Spread the love

భక్తులందరికీ నమస్కారం.

మన 108 దివ్యదేశాల సిరీస్‌లో ఇప్పటి వరకు వివిధ దివ్యదేశాల గురించి తెలుసుకున్నాం. ఈ
శ్రీవైష్ణవదివ్యదేశాలు – భాగం 5 లో తొండై నాడు దివ్యదేశాల గురించి తెలుసుకుందాం…

తొండై నాడులో మొత్తం 22 దివ్యదేశాలు ఉన్నాయి. ఇవన్నీ తమిళనాడులోని ప్రాచీన తొండై మండలం పరిధిలో ఉన్న అత్యంత పవిత్రమైన శ్రీమహావిష్ణు క్షేత్రాలు

తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల ప్రయాణ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ 22 దివ్యదేశాలను ప్రధానంగా రెండు క్లస్టర్లుగా విభజించవచ్చు.

📍 1. కాంచీపురం ప్రాంత దివ్యదేశాలు – 15

కాంచీపురం నగరంలో ఉన్న 14 దివ్యదేశాలతో పాటు, సమీపంలోని తిరుప్పుట్కుళి దివ్యదేశాన్ని కలిపి మొత్తం 15 దివ్యదేశాలు ఈ క్లస్టర్‌లో ఉంటాయి.

📍 2. చెన్నై ప్రాంత దివ్యదేశాలు – 7

షోలింగూర్, తిరువళ్లూర్, తిరునిన్రవూర్, తిరునీర్మలై, తిరువిడందై, మహాబలిపురం మరియు చెన్నైలోని తిరువల్లికేణి (పార్థసారథి స్వామి) దివ్యదేశాలు ఈ క్లస్టర్‌లో ఉంటాయి.

ఈ విధంగా యాత్రను ప్లాన్ చేసుకుంటే ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఈ విభజన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ 22 తొండై నాడు దివ్యదేశాలను ప్రశాంతంగా, ఎలాంటి హడావిడి లేకుండా దర్శించాలంటే కనీసం మూడు రోజుల సమయం కేటాయించడం ఉత్తమం.

ఈ భాగంలో ముందుగా కాంచీపురం క్లస్టర్‌లోని దివ్యదేశాల గురించి తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు సాధారణంగా వెల్లూరు మీదుగా కాంచీపురం చేరుకోవడం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది.

కాంచీపురం ప్రాంతంలో మొత్తం 15 దివ్యదేశాలు ఉన్నాయి. వీటిలో 14 దివ్యదేశాలు కాంచీపురం నగరంలోనే ఉండగా, ఒక దివ్యదేశం తిరుప్పుట్కుళి కాంచీపురానికి కొంత దూరంలో ఉంటుంది.

కాంచీపురం ప్రాంతంలోని 15 దివ్యదేశాలు

కాంచీపురం బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఆటోను మాట్లాడుకుని, “కాంచీపురంలోని 14 పెరుమాళ్ దివ్యదేశాలు అన్నీ చూపించాలి” అని ముందుగానే స్పష్టంగా చెప్పాలి. అలాగే ఎంత ఛార్జీ తీసుకుంటారు, ఏ ఏ ఆలయాలు చూపిస్తారు అనే విషయాలను ముందుగానే పూర్తిగా మాట్లాడుకుని నిర్ణయించుకోవడం మంచిది.

ఒక ముఖ్యమైన సూచన: కాంచీపురంలో కొంతమంది ఆటో డ్రైవర్లు కొన్ని ఆలయాలను వదిలేసి యాత్ర పూర్తయిందని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి 14 దివ్యదేశాల జాబితాను ముందుగానే మీ దగ్గర ఉంచుకుని, ఒక్కో ఆలయం దర్శనం పూర్తవుతున్న కొద్దీ చెక్ చేసుకుంటూ వెళ్లండి. అలాగే ఆటో ఎక్కే ముందే 14 దివ్యదేశాలు అన్నీ చూపించాలని స్పష్టంగా చెప్పి ధరను కూడా ఖరారు చేసుకోవడం మంచిది. సాధారణంగా 14 దివ్యదేశాలను చూపించడానికి ఆటో ఛార్జీ ₹800 నుండి ₹900 వరకు ఉంటుంది. అయితే సీజన్, రద్దీ, బేరసారాలను బట్టి ఈ ధరలో కొంత మార్పు ఉండవచ్చు. అందుకే ఎంత ఛార్జీ తీసుకుంటారు, ఏ ఏ ఆలయాలు చూపిస్తారు అనే విషయాలను ముందుగానే పూర్తిగా మాట్లాడుకుని నిర్ణయించుకోవడం మంచిది.

ఉదయం 6:30 నుంచి 7:00 గంటలలోపు యాత్ర ప్రారంభిస్తే, రద్దీ తక్కువగా ఉండటంతో కాంచీపురం నగరంలోని 14 దివ్యదేశాలను ఒకే రోజులో ప్రశాంతంగా దర్శించుకోవచ్చు.

ఆ తర్వాత సాయంత్రం కాంచీపురానికి కొంత దూరంలో ఉన్న తిరుప్పుట్కుళి శ్రీ విజయరాఘవ పెరుమాళ్ దివ్యదేశంకు బస్సు లేదా ఆటో ద్వారా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.

ఈ విధంగా కాంచీపురంప్రాంతంలోనిమొత్తం 15 దివ్యదేశాలయాత్రపూర్తవుతుంది.

కాంచీపురం ప్రాంతంలోని 15 దివ్యదేశాలు

  1. శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవస్థానం (తిరుక్కచ్చి – అత్తిగిరి)( Vishnu Kanchi)
  2. శ్రీ అష్టభుజకర పెరుమాళ్ దేవస్థానం
  3. శ్రీ దీపప్రకాశ పెరుమాళ్ దేవస్థానం (తిరుత్తంకా)
  4. శ్రీ అళగియ సింగర్ (నరసింహ స్వామి) దేవస్థానం (తిరువేలుక్కై)
  5. శ్రీ యథోక్తకారి పెరుమాళ్ దేవస్థానం (తిరువెక్కా)
  6. శ్రీ పాండవదూత పెరుమాళ్ దేవస్థానం (తిరుప్పాడగం)
  7. శ్రీ ఉలగలంద పెరుమాళ్ దేవస్థానం (తిరువూరగం)

👉 గమనిక: ఉలగలంద పెరుమాళ్ దేవస్థానం ప్రాంగణంలోనే మొత్తం నాలుగు దివ్యదేశాలు ఉన్నాయి.

  • తిరువూరగం (ఉలగలంద పెరుమాళ్)
  • తిరునీరగం
  • తిరుక్కారగం
  • తిరుక్కార్వానం
  1. తిరునీరగం (ఉలగలంద పెరుమాళ్ ఆలయంలోనే)
  2. తిరుక్కారగం (ఉలగలంద పెరుమాళ్ ఆలయంలోనే)
  3. తిరుక్కార్వానం (ఉలగలంద పెరుమాళ్ ఆలయంలోనే)
  4. శ్రీ వైకుంఠ పెరుమాళ్ దేవస్థానం (పరమేశ్వర విన్నగరం)
  5. శ్రీ పావళవన్నర్ దేవస్థానం
  6. తిరుక్కళ్వనూర్ (శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం లోపల)
  7. తిరునిలాత్తింగళ్ తుండం (శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం లోపల)
  8. శ్రీ విజయరాఘవ పెరుమాళ్ దేవస్థానం, తిరుప్పుట్కుళి

ఆ తర్వాత సాయంత్రం కాంచీపురానికి కొంత దూరంలో ఉన్న తిరుప్పుట్కుళి శ్రీ విజయరాఘవ పెరుమాళ్ దివ్యదేశంకు బస్సు లేదా ఆటో ద్వారా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.

ఈ విధంగా కాంచీపురం ప్రాంతంలోని మొత్తం 15 దివ్యదేశాల యాత్ర పూర్తవుతుంది.

కాంచీపురం ప్రాంతంలోని మొత్తం 15 దివ్యదేశాల దర్శనం పూర్తయిన తర్వాత రాత్రికి చెన్నై చేరుకుని బస చేయడం ఉత్తమం. చెన్నైలో తాంబరం ప్రాంతంలో గది తీసుకుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే మరుసటి రోజు దర్శించాల్సిన షోలింగూర్, తిరువళ్లూర్, తిరునిన్రవూర్, తిరునీర్మలై, తిరువిడందై, మహాబలిపురం, తిరువల్లిక్కేణి (పార్థసారథి) వంటి దివ్యదేశాలకు తాంబరం మధ్యలో ఉండటంతో ప్రయాణం సులభంగా ఉంటుంది. అందువల్ల చెన్నై క్లస్టర్ యాత్రకు తాంబరం ప్రాంతంలో బస చేయడం మంచి ఎంపిక.


శ్రీవైష్ణవదివ్యదేశాలు – భాగం 5 పూర్తయింది

చెన్నై క్లస్టర్‌లోని మిగిలిన 7 దివ్యదేశాల యాత్రను తదుపరి శ్రీవైష్ణవదివ్యదేశాలు – భాగం 6 వివరంగా తెలుసుకుందాం.

మా ఈ చిన్న ప్రయత్నానికి మీ గోరంత సహకారం మాకు కొండంత బలాన్నిస్తుంది.”

ఈ వెబ్‌సైట్ కస్టమైజేషన్‌పై మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు లేదా అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.

Payment Banner

Spread the love

Leave a Reply