కాంచీపురం అనగానే అందరికీ ఇవే గుర్తొస్తాయి… కానీ 1,300 ఏళ్ల నాటి ఈ అద్భుత ఆలయం తెలుసా?
విషయ సూచిక కాంచీపురం – ఆలయాల నగరం కాంచీపురం అనగానే మనలో చాలామందికి వెంటనే కొన్ని ప్రసిద్ధమైన విషయాలే గుర్తుకు వస్తాయి. శివకాంచి… విష్ణుకాంచి… కామాక్షి అమ్మవారి ఆలయం… వామనావతారంతో ముడిపడిన దివ్యక్షేత్రాలు… అన్నింటికంటే చివరగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాంచీపురం పట్టు చీరలు. ఇన్ని ప్రత్యేకతలు ఒకే నగరంలో ఉండటం వల్ల కాంచీపురం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరాలలో ఒకటిగా నిలిచింది. శైవం, వైష్ణవం, శాక్త సంప్రదాయాలతో పాటు ప్రాచీన తమిళ సంస్కృతి, కళలు, శిల్పకళకు…