
పన్నెండు మంది ఆళ్వార్ల అవతార స్థలాలు మరియు జన్మ నక్షత్రాలు
- శ్రీ పొయ్గై ఆళ్వార్ – కాంచీపురంలోని తిరువెక్కా దివ్యదేశంలో, శ్రవణ నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ భూతత్తాళ్వార్ – మహాబలిపురంలోని తిరుక్కడల్మల్లై దివ్యదేశంలో, ఐప్పసి మాసంలోని అవిట్టం (ధనిష్ఠ) నక్షత్రంలోఅవతరించారు.
- శ్రీ పేయాళ్వార్ – మైలాపూర్ లో, ఐప్పసి మాసంలోని సతయం (శతభిష) నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ తిరుమళిశై ఆళ్వార్ – తిరుమళిశై లో, తై మాసంలోని మఘం (మఖ) నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ నమ్మాళ్వార్ – ఆళ్వార్ తిరునగరి (తిరుక్కురుగూర్) లో, వైకాసి మాసంలోని విశాఖ నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ మధురకవి ఆళ్వార్ – తిరుక్కొళూర్ లో, చిత్తిరై మాసంలోని చిత్రా నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ కులశేఖర ఆళ్వార్ – చేర రాజ్యంలోని మాకోటై ప్రాంతంలోని తిరువాంచికుళం లో, మాసి మాసంలోని పునర్పూసం (పునర్వసు) నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ పెరియాళ్వార్ – శ్రీవిల్లిపుత్తూర్ లో, ఆని మాసంలోని స్వాతి నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ ఆండాళ్ – శ్రీవిల్లిపుత్తూర్ లో, ఆడి మాసంలోని పూరం (పూర్వ ఫల్గుణి) నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ తోండరడిప్పొడి ఆళ్వార్ – తిరుమందంగుడి లో, మార్గళి మాసంలోని కేట్టై (జ్యేష్ఠ) నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ తిరుప్పాణ్ ఆళ్వార్ – ఉరయ్యూర్ లో, కార్తిగై మాసంలోని రోహిణి నక్షత్రంలో అవతరించారు.
- శ్రీ తిరుమంగై ఆళ్వార్ – తిరుక్కురయలూర్ లో, కార్తిగై మాసంలోని కృత్తిక నక్షత్రంలో అవతరించారు.
తదుపరి భాగంలో, శ్రీ వైష్ణవ దివ్యదేశాల మహిమను మరింత వివరంగా తెలుసుకుందాం.
శ్రీనివాసుని కృపాకటాక్ష ప్రాప్తిరస్తు. 🙏
శ్రీమన్నారాయణుని దివ్యసేవలో మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నానికి మీ అమూల్యమైన ఆదరణ, ప్రోత్సాహం మరియు ఆశీర్వాదం అందిస్తారని వినయపూర్వకంగా కోరుతున్నాము.
జై శ్రీమన్నారాయణ! 🙏
